Ads 468x60px

gghgh

Photo Slide

About TELANGANA


Telangana region is part of Andhra Pradesh state in southern India. It constitutes Hyderabad, Adilabad, Karimnagar, Khammam, Mahaboobnagar, Medak, Nalgonda, Nizamabad, RangaReddy and Warangal districts. Telangana region is one of the least developed regions in India. Rampant poverty, illiteracy, malnourished children, child labor, farmer suicides, unemployment, water scarcity and electricity shortage are some of the problems of this region. There are millions of people who are not fortunate enough to send their children to schools or feed their children three time a day, or provide safe drinking water to their families in this area.

Sunday, January 8, 2012

TODAYS NEWS

గుండె లోతుల్లోంచి పెల్లుబుకుతున్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ముందు ఏ యిజాలూ నైజాలూ పనికిరాని చోట.. ఫ్యాక్షనిజమే వారి పాలిట వరమైంది! ఇనుపరాడ్లు.. దుడ్డుకపూరలు.. బస్తాలకొద్దీ రాళ్లు.. చేతుల్లో కారం పొట్లాలు..! సుశిక్షితులైన కిరాయి సేన! అడ్డంగా విరుచుకుపడే గూండాల దండు! వంకర తిరిగిన వేట కొడవళ్లొక్కటే బయటికి కనిపించలేదు! ముందు ఓ నలభై వాహనాలు.. వెనుక మరో 40 వాహనాలు.. మధ్యలో అధినేత వాహనం! పొరుగు దేశంపై యుద్ధానికి వెళుతున్నట్లు.. ఆగర్భ శత్రువును వేటాడుతున్నట్లు! జీపుల్లో గుత్పలు పట్టుకుని వీరంగం వేస్తూ.. వేషధారణ.. హావభావాలు.. వాడిన భాష! అంతా సీమ నుంచే దిగుమతైనట్లు! ఇది తెలంగాణ గుండెలపై సీమ ఫ్యాక్షనిస్టుల పదఘట్టన! కరడుగట్టిన సమైక్యవాది, రెండు కళ్ల సిద్ధాంతి చంద్రబాబు నాయుడు రైతు పోరుబాట కోసం పెంబర్తిలో ప్రవేశించింది మొదలు.. జనగామ చేరే వరకూ.. నవాబుపేట దాటుకుని పాలకుర్తి చేరుకున్నాకా.. దారిపొడవునా ఒకటే దంచుడు! జై తెలంగాణ అంటే అదేదో తమ అధినేత వినకూడని పదమైనట్లు! ‘సమైక్యవాది గో బ్యాక్’ అని ప్లకార్డు చూపిస్తే.. అపశకునం ఎదురైనట్లు! ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకోవద్దంటే.. అయ్య ముల్లె అడిగినట్లు! వేలు చూపించి బెదిరిస్తూ.. కర్రలు చూపి కళ్లెపూరజేస్తూ.. చంద్రదండు తెలంగాణ గడ్డపై వేసిన వీరంగం! ‘‘చంపండిరా.. ఏసెయ్యెండిరా కొడుకులను..’’! చంద్రబాబు పర్యటించే ప్రాంతంలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఒకేరకమైన దాడులు! వారం పది రోజుల ముందు నుంచే పూర్తి స్థాయి శిక్షణ పొందినట్లు! రక్తం కారుతున్నా.. మనిషి చచ్చాడో బతికాడో తెలియని స్థితిలో కుప్పకూలిపోయి ఉన్నా.. దుడ్డుకపూరలతో, ఇనుపరాడ్లతో బాది.. ఉద్యమకారులను తరిమి.. దొరికినవారిపై పిడిగుద్దులు కురిపించి.. తలలు పగులగొట్టి.. వీపులు చిట్లగొట్టి.. నెత్తురు చిందించి! బాధతో ఉద్యమకారుడి ఆక్రందన! కళ్లు తెరిస్తే దవాఖానలో! కేయూ పొల్లగాళ్లు కంచర్ల మనోజ్‌కుమార్, గోగుల మహేందర్‌డ్డి, విద్యార్థి నేత నీలం రాజ్‌కిషోర్.. చంద్రదండు పాశవికదాడిలో ప్రాణాలపైకి తెచ్చుకున్నవారిలో వీరు కొందరే! ఇలాంటివారే అనేక మంది! వేల సంఖ్యలో ప్రత్యర్థి సేనలు పొంచి ఉన్న విషయం తెలిసినా.. చంద్రబాబు ముందు జై తెలంగాణ అని గొంతు చించుకుంటే భూమిపై నూకలు మిగలవన్న సంగతి అర్థమైనా.. చంద్రబాబు గో బ్యాక్ అంటే చంద్రదండు తరిమి తరిమి కొడుతుందని కళ్లముందే కనపడుతున్నా.. తెలంగాణ యువకులు వీరకిశోరాలై ఢీకొన్నారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని అందించిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు కదిలారు. ఆయుధంతో ఉన్న శత్రువును బలమైన ప్రత్యేక రాష్ట్ర ‘ఆకాంక్షతో’ అడ్డుకున్నారు.

రాయిని నిరసనగా మార్చిందొకరు.. చెప్పులు చూపి శాపనార్థాలు పెట్టిందొకరు.. చీపుళ్లు ఎత్తి అవమానించిది ఒకరు.. ఆగ్రహంతో బూట్లను వేదికపైకి విసిరేసింది ఇంకొకరు! రూపం ఏదైనా అందరి నిరసన ఉద్దేశం ఒకటే! అందరు అడిగిందీ ఒకటే! తెలంగాణపై డొంకతిరుగుడు మాట కాదు.. తెలంగాణకు జై కొడతావా? నై కొడతావా? సకల ఉద్యమకారుల నుంచి చంద్రబాబుకు ఒకటే ప్రశ్న! సూటిగా తగులుతున్న ఆ ఒక్క ప్రశ్నే చంద్రబాబులో ఫ్యాక్షనిస్టును నిద్రలేపింది. సీమ వారసత్వాన్ని గుర్తు చేసింది. తెలంగాణ జెండా మాటున పబ్బం గడిపేసుకోవాలని చూసిన టీడీపీ టీ ఫోరంలో చిరాకు తెప్పించింది. ‘‘ఇంతకాలం మౌనంగా ఉన్నాం. ఇప్పుడలా ఉండం. ఎవరొస్తరో రండి తేల్చుకుందాం’’ అన్నట్టుగానే తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు. తోడు నిలిచిన సీమ ఫ్యాక్షనిస్టుల అండ చూసుకుని రెచ్చిపోయారు. ప్రత్యేక రాష్ట్రం కోసం మేమూ పోరాడుతున్నాం అంటూ వల్లెవేసే నేతాక్షిగేసరులు అదే తెలంగాణవాదులపై యుద్ధం ప్రకటించిన సన్నివేశం.. వరంగల్ జిల్లాలో ఆవిష్కృతమైంది. ఇకపై టీఆర్‌ఎస్, ఇతర తెలంగాణవాదులతో టీడీపీ అనుసరించనున్న యుద్ధ వ్యూహం నమూనా వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా బట్టబయలైంది. ఒక భావజాలంపై మరొక భావజాలం ఇకపై భౌతికదాడులనే ఎంచుకుంటున్న సంకేతాలు వెలువరించింది. రైతుల సమస్యలపై పాదయాత్ర ముసుగులో రాజకీయ కోణం నగ్నంగా నర్తించింది. నాయకుడు రైతుల దగ్గరకు వెళతాడు. కానీ.. ఆ రైతు పార్టీ నాయకుడో, కార్యకర్తో అవుతాడు! మరి ఫణికర మల్లయ్య మరెవరికీ పూనకూడదుకదా! ‘‘ఇగ రాండ్లి చూసుకుందాం.. ఇగ గ్రామాల్లో గిరిగీసుకుందాం’ అని ఎర్రబెల్లి చేసిన ప్రకటన వెనుక దాగి ఉన్న భరోసా ఈ సీమ ఫ్యాక్షనిజమే! ‘‘మా నాయకుడి పర్యటనను ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి.

అడ్డుకొని చూడండి.. అసలు సంగతి తెలుస్తుంది’’ అంటూ టీడీపీ నాయకులు ముందునుంచీ చేసిన హెచ్చరికలకు బలం ఈ ఫ్యాక్షనిజమే! జై తెలంగాణ అన్నవాళ్లను దంచండీ.. ఏమైనా మేం చూసుకుంటాం అని టీడీపీ నేతలు తమ శ్రేణులకు కర్తవ్యబోధ చేయడం వెనుక బలగం ఈ ఫ్యాక్షనిజమే! బాబు ప్రయాణం సాగింది మూడు నియోజకవర్గాల మీదుగానే అయినా.. ఈ మూడు ప్రాంతాల్లోనే తెలంగాణవాదుల నిరసన కార్యాచరణలు ఉన్నా.. దాడులు మాత్రం జిల్లా వ్యాప్తంగా జరగడమే ఇక్కడ విశేషం. ఇవి యాత్రను సజావుగా సాగించుకునేందుకు చేసిన దాడులు కాదు.. జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదాన్ని అణిచివేయడానికి, టీడీపీ వైఖరిని ఎవరూ నిలదీయకుండా చేసుకోవడానికి రచించిన కుట్రలేనన్నది తెలంగాణవాదుల ఆరోపణ. సమైక్యవాది సభ కోసం పాలకుర్తి వెళ్లొద్దని గడ్డం పట్టుకొని నచ్చచెబుతున్న చోట కూడా రక్తం కారించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఎర్రబెల్లి స్వగ్రామం, పర్వతగిరి మండల కేంద్రంలో తెలుగుతమ్ముళ్లు రెచ్చిపోయారు. మహిళన్న విచక్షణా పాటించలేదు. కర్రలు బుర్రలను బద్దలుకొట్టాయి. నెక్కొండ (నర్సంపేట నియోజకవర్గం)లో రాస్తారోకో చేస్తోన్న టీఆర్‌ఎస్, జాక్ ఇతర తెలంగాణవాదులపైనా టీడీపీ కార్యకర్తలు విచక్షణను మరచిపోయి కొట్టారు. ఈ దాడిలో హెడ్‌కానిస్టేబుల్ సహా పలువురికి గాయాలయ్యాయి. ఇదే నియోజకవర్గంలోని గూడురు, నల్లబెల్లి దుగ్గొండి మండలాల్లోనూ ఇదే తీరు! ఆత్మకూర్ మండల కేంద్రంలో పరకాల నియోజకవర్గ పసుపుదళం పాశవికంగా దాడులకు దిగింది. గీసుగొండలో బెదిరింపులకు గురిచేసింది. జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో, ఒకే రీతిగా దాడులకు దిగడంలాంటి చర్యలు ఇక నుంచి జిల్లాలో టీడీపీ రాయల‘సీమ’ ఫ్యాక్షన్ సంస్కృతిని అమలు చేయబోతున్నాదా? అన్న అనుమానాలను రేకెత్తిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

చంద్రబాబు పర్యటించని నియోజకవర్గాల్లో బయటి జిల్లాల నుంచి వచ్చినవావ్లూవరూ లేకపోవడం గమనార్హం. ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలే తమతమ అధినేతల నుంచి అందుకున్న ‘దంచుడు’ వ్యూహానికి దారులు వేసినట్టు, ఆ వ్యూహం, స్కెచ్ అంతా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే రూపొందినట్లు స్పష్టం అవుతోందని వారు విమర్శిస్తున్నారు. చంద్రబాబు కాన్వాయికి 40 వాహనాల ముందు, 40 వాహనాల తరువాత మొత్తం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన యువకులు నిండిపోవడం, పాదయాత్ర ముందూ వెనుకా వాళ్ల తరువాతే స్థానిక నాయకులు ఉండటం గమనిస్తే అంతా పక్కా వ్యూహం ప్రకారమే జరిగిందన్న అభివూపాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చంద్రబాబు తెలంగాణ రైతుల కష్టాన్ని కడతేర్చేందుకు చేసిన యాత్రలా కాకుండా తెలంగాణపై పోరుయాత్ర చేసినట్టుగా ఉందని, ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలే దీన్ని స్పష్టం చేస్తున్నాయని టీఆర్‌ఎస్ మండిపడుతోంది.

ముందు అనుకున్నట్టుగానే చంద్రబాబు మాట్లాడుతుంటే జై తెలంగాణ.. ఆంధ్రాబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశాను. అంతే ఒక్కసారిగా చంద్రదండు దుడ్డు కర్రలతో, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఎయ్యిరా ఎయ్.. అంటూ కొట్టారు. తప్పించుకుని ఉరికాను. వెంటపడి పీకపట్టుకుని కర్చీఫ్ నుంచి కత్తి తీసి పొడవబోయారు. పోలీసులు అడ్డుకుని కాపాడారు. చంద్రదండు దెబ్బలకు సృ్పహ తప్పి పడిపోయాను. పోలీసులే ఆసుపవూతులకు తరలించారు.

-కంచర్ల మనోజ్‌కుమార్,
కేయు విద్యార్థి



చంద్రబాబు ప్రసంగం సజావుగా సాగితే మనం వేస్ట్ అని డిసైడయ్యా. అప్పటికే సభలో దుడ్డు కర్రలతో తిరుగుతున్న వారి నుండి తప్పించుకోలేమని తెలుసు. అయినా సరే చంద్రబాబు మాట్లాడుతుండగానే జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టాను. అంతే వెనుక నుంచి చంద్రబాబు గూండాలు కొట్టడం మొదలుపెట్టారు. అయినా పట్టించుకోలేదు. నినాదాలు చేస్తూనే ఉన్నా. బారికేడ్లు ఊడిపోయాయి. కడుపుపై, తలపై కొట్టడం మొదలుపెట్టారు. అంతలోనే పక్కనున్న స్నేహితులు కూడా నినాదాలు చేయడం మొదలు పెట్టారు. ఎవరు ఎవరిని కొడుతున్నారో అర్థం కాలేదు. పోలీసులు చంద్రబాబు గూండాల నుంచి తప్పించి బయటికి తీసుకువచ్చారు.

- రాజుయాదవ్, కేయూ విద్యార్థి

0 comments:

Post a Comment