Ads 468x60px

gghgh

Photo Slide

About TELANGANA


Telangana region is part of Andhra Pradesh state in southern India. It constitutes Hyderabad, Adilabad, Karimnagar, Khammam, Mahaboobnagar, Medak, Nalgonda, Nizamabad, RangaReddy and Warangal districts. Telangana region is one of the least developed regions in India. Rampant poverty, illiteracy, malnourished children, child labor, farmer suicides, unemployment, water scarcity and electricity shortage are some of the problems of this region. There are millions of people who are not fortunate enough to send their children to schools or feed their children three time a day, or provide safe drinking water to their families in this area.

Monday, December 10, 2012

పాలమూరులో కురుమూర్తి క్షేత్రం మన ఏడుకొండలవాడు





తెలంగాణలో జరిగే అతిపెద్ద తిరునాళ్ళలో కురుమూర్తి జాతర ఒకటి. ఇక్కడ నవంబర్ 13న అమావాస్య రోజున బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అవి డిసెంబర్ 13న అమావాస్యతో ముగుస్తున్నయి. ఈ సందర్భంగా ‘ఆనందగిరి ఏడుకొండల’పై వెలిసిన వేంక స్వామిపై ‘బతుకమ్మ’ ప్రత్యేక కథనం.

స్థల పురాణం
ప్రకృతి శోభతో అలరారే కురుమూర్తి గిరులపై వెలసింది సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేషుని ప్రతిరూపమేనని స్థల పురాణం పేర్కొంటున్నది. ఇక్కడ అరుదైన పుష్ప, పక్షి జాతులు కూడా ఉన్నయి. నేటికీ ఈ పరిసరాలు జీవ వైవిధ్యంతో పచ్చదనాన్ని పులుముకుని కళకళలాడుతూ ఉంటయి.
ఇక్కడి గిరుల వర్ణన ప్రాచీన సాహిత్యంలో విశేషంగా కనిపిస్తుందని స్థానిక పండితులు చెబుతరు. బుక్కపట్టణం బుచ్చి వెంకటాచార్యులు రాసిన ‘శ్రీ ఉత్తర వెంకటాచల మహత్యం’ నకీ.శ. 1854-61) గ్రంథంలో కురుమూర్తి గిరుల శోభ ప్రస్తావన ఉన్నట్టు చెబుతరు.

అజకొల్లు శేషకవి ‘శ్రీ కురుమూర్తి క్షేత్రస్థల పురాణం’ (1850)లో మొత్తం 107 పద్యాలు ఉన్నయి. 1851-1905 మధ్య కాలంలో కురుమూర్తి స్వామి సుప్రభాతాలు ప్రసిద్ధినొందాయి. వీటిని శ్రీనివాస విలాస గ్రంథకర్త కృష్ణమాచార్యులు రచించారు. కాగా, స్థానిక కవి పండితులు వైద్యమ్ వెంక 1983లో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ‘శ్రీకురుమూర్తి క్షేత్ర చరివూత’ రాయడమేకాక 2005లో సంస్కృత గ్రంథమైన శ్రీఉత్తర వేంకటాచల మహత్మ్యం’ను తెలుగులోకి అనువదించారు.
 వీటితోపాటు 1959లో వి.రామకృష్ణయ్య ముద్రించిన శ్రీకుర్మూర్తిస్వామి భజన కీర్తనలు, విశ్రాంత ఉపాధ్యాయుడు బెల్లం సాయిలు ఇటీవలి కాలంలో ప్రచురించిన కురుమూర్తిస్వామి భజన కీర్తనలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి. చరిత్ర, సాహిత్య పరిశోధకుడు కపిలవాయి లింగమూర్తి ఈ క్షేత్రం వివరాలను ఎన్నింటినో సేకరించి పరిశోధకులకు అందించారు. స్వామిని కీర్తించే అనేక జానపద గేయాలను వనపర్తికి చెందిన ఉమ్మెత్తల నర్సింహమూర్తి సేకరించారు. మరోవైపు పలువురు విద్యార్థులు ఈ క్షేత్రంపై పరిశోధనలూ సల్పుతున్నరు.

స్వామి ‘ప్రతిరూపాలు’ వెలసిన పవిత్ర క్షేత్రం
ఆకాశరాజు కుమార్తె పద్మావతిని పెండ్లాడేందుకు కుబేరుని వద్ద అప్పు చేసి, దానిని తీర్చడంలో మాట తప్పానని మనస్థాపం చెందాడు మహావిష్ణువు. స్వామి కృష్ణానదీ తీరం వెంట వెళ్తూ జూరాల వద్ద గల గుండాల జలపాతం వద్ద స్నానం చేశాడు. అక్కడ్నించి ఉత్తర దిశగా వెళ్తున్న సమయంలో లక్ష్మీదేవి కోరిక ఆయనకు గుర్తొచ్చిందిట. ఆ మేరకు అక్కడి ‘కురుమూర్తి గిరుల’పై విశ్రమించాడు. అక్కడ్నించి తిరిగి వెళ్ళేటప్పుడు తమ ప్రతిరూపాలను మాత్రం ఇక్కడే వదిలి వెళ్ళారని స్థల పురాణం వివరిస్తోంది. అదే ‘కురుమార్తి స్వామి’ క్షేత్రమైంది.

‘కురుమూర్తి స్వామి’ క్షేత్రానికి సంబంధించి ‘దుర్వాస, దిలీప సంవాదం’ అనే కథతో పాటు జానపదులు చెప్పుకొనే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దాని ప్రకారం తిరుపతి ఏడుకొండల స్వామి క్షేత్రానికి, ఈ దేవస్థానానికి మధ్య విశేషమైన పోలికలు కనిపిస్తయి.

చారివూతక నేపధ్యం -దశాబ్దాల చరిత్ర 
కాకతీయుల సామంతుడిగా, రాజవూపతినిధిగా బాధ్యతలు నిర్వహించిన గోన గన్నాడ్డి కుటుంబ సమేతంగా తిరుపతి యాత్రకు వెళ్లాట్ట. ఆ సమయంలో ఇక్కడికి సమీపంలోని చంద్రగిరి ప్రాంతంలోని ముక్కెర వంశస్థుడైన గోపాలడ్డిని కలిశారు. ఆయన గుణగణాలను, ధైర్య సాహసాలను, ఇచ్చిన ఆతిథ్యానికి ముగ్దుడై, వర్థమానాపురం (వడ్డేమాన్) పరగణాకు తనను ఆహ్వానించాడు. అక్కడికి వచ్చిన గోపాలడ్డికి ‘మక్తలనాడ గౌడ’ పదవిని అప్పగించాడు.

అలా ముక్కెర వంశానికి చెందిన గోపాల్‌డ్డి మొదలుకొని నకీ.శ. 1268) సంస్థానాలు విలీనమయ్యే నాటికి అధికారంలో ఉన్న భాగ్యలక్ష్మీ దేవి (1948) దాకా మొత్తం 28 తరాల వారు అందరూ తమ ఇలవేల్పు అయిన ఇక్కడి ‘కురుమూర్తి స్వామి’ ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నది చారివూతిక సమాచారం.

రమణీయమైన ప్రకృతి శోభ నడుమ, కొండగుహల మధ్య వెలసిన కురుమూర్తి స్వామి వారికి క్రీ.శ.1350లో అప్పటి సంస్థాన బాధ్యతలు నిర్వహించిన చంద్రాడ్డి ఆలయం నిర్మించాడని తెలుస్తోంది. అనంతరం ఇదే వంశానికి చెందిన మిగిలిన రాజ వంశీయులు కొండకు మెట్లు, మండపాలు, కొండ కింద కోనేరు నిర్మాణాలకు పూనుకొన్నారని చారివూతక ఆధారాలు స్పష్టం చేస్తున్నయి. రాజా సీతారామభూపాల్, రాజా శ్రీరామభూపాల్‌లతోపాటు ఆత్మకూరు సంస్థానాన్ని చివరగా పాలించిన భాగ్యలక్ష్మీ దేవిలు కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధి కోసం విశేష కృషి సలిపారు. స్వామి వారికి ‘వార్షిక బ్రహ్మోత్సవాల’ను ఘనంగా నిర్వహించడంలోనూ వారు ప్రధాన భూమికను పోషించారు.
ఇక్కడి ఆంజనేయస్వామి ఆలయం 1810-1840ల మధ్య కాలంలో నిర్మితమైనట్టు భావిస్తున్నరు. 1878లో ఉద్దాల మండపాన్ని నిర్మించగా, నగారా బంగ్లా (నవత్ ఖానబంగ్ల) వాద్యకారుల కోసం 1857-78 మధ్య కాలంలో నిర్మితమైనట్టు చెబుతున్నరు. సీతారామభూపాలుడే ఉత్సవాల సందర్భంగా దీనిని ఉపయోగించేవారని తెలుస్తోంది. ఇక, విశాలమైన ధర్మశాలను, ప్రాచీనమైన మెట్లను అదే కాలంలో నిర్మించినట్లు చరిత్ర ఉంది.

ముక్కెర వంశస్థుల ఆభరణాలు
అమరచింత (అమ్మాపూర్) సంస్థానాధీశుల ఇలవేల్పు అయిన కురుమూర్తి స్వామికి ముక్కెర వంశస్థులైన రాజా సోంభూపాల్ 15వ శతాబ్దంలో బంగారు ఆభరణాలను సమర్పించారు. శంఖుచక్షికాలు, కిరీటం, మకర కుందనాలు, భుజ కిరీటాలతో సహా వివిధ ఆభరణాలు ఈ స్వామి వారికి బహుకరించారు. నాటి నుండి నేటి వరకు ఆ ఆభరణాలను స్వామివారికి ఉత్సవాల సందర్భంగా అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.

మొదట్లో ఆభరణాల భద్రత దృష్ట్యా వాటిని సంస్థానాధీశుల బంగ్లాలోనే ఉంచేవారు. ఉత్సవాల సందర్భంగా రాజభవనం ముందున్న కొలనులో ఆభరణాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు జరిపేవారు. అనంతరం కొండపైకి వాటిని వేడుకగా తీసుకు వెళ్ళి స్వామివారికి అలంకరించేవారు.
1968లో కురుమూర్తి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖలో విలీనమైంది. ఫలితంగా 1976 నుంచి ఆభరణాలను ఆత్మకూరు బ్యాంకులోని ప్రత్యేక లాకర్‌లో భద్రపరుస్తున్నరు. ఉత్సవాల సందర్భంగా వాటిని తెచ్చి స్వామి వారికి అలంకరిస్తున్నరు. ముక్కెర వంశస్థులే నేటికీ ఆభరణాల అలంకరణోత్సవంలో ప్రధాన భూమికను పోషిస్తున్నరు.

దినదినాభివృద్ధి
మహిమాన్విత క్షేత్రమైన శ్రీ కురుమూర్తి స్వామి మూలవిరాట్టు మొదట్లో సహజ సిద్ధమైన గుహలలో పెద్ద రాతిగుండు కింద ఉండేది. భక్తులు గుహ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొనేవారు. రోజురోజుకూ భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో గర్భగుడికి గోపురం నిర్మించారు. దానిముందు మండప నిర్మాణం, ధ్వజ స్తంభం ఏర్పాటు చేశారు.

అమరచింత నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసనసభ్యులు, ప్రజావూపతినిధులు, ఆలయ ధర్మకర్తల మండలితో పాటు దాతల సహకారంతో భక్తుల సౌకర్యార్థాలు, పలు అభివృద్ధి కార్యక్షికమాలను నిరంతరం అమలు జరుపుతున్నరు. స్వామి భక్తుడైన రాయిచూరు కుర్మిడ్డి ఆలయ అభివృద్ధి పనుల కోసం నిరంతరం కృషి చేయడంతో పాటు ప్రస్తుతం శాశ్వత అన్నదాన సత్రాన్ని నిర్మిస్తుండడం ఓ ప్రత్యేకత.

అమావాస్య రోజు అన్నదానం
కురుమూర్తిని సందర్శించుకునే భక్తుల సౌకర్యార్థం కొండ కింద శాశ్వత షెడ్లు నిర్మించారు. విశ్రాంతి గృహం, కళ్యాణ కట్ట, మంచినీటి సౌకర్యం కోసం కొండ కింద, పైన వాటర్ ట్యాంకులను నిర్మించారు. కేవలం ఉత్సవాల సందర్భంగానే కాకుండా ప్రతి అమావాస్యకు భక్తులు స్వామిని దర్శించుకుంటరు.

ప్రతి అమావాస్యకు 15 నుండి 20 వేల మంది వరకు భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తారని అంచనా. ఈ సందర్భంగా కొందరు దాతల సహకారంతో ఆలయ ప్రాంగణంలో ‘అన్నదాన కార్యక్షికమాని’కి శ్రీకారం చుట్టారు. అప్పంపల్లికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బెల్లం సాయిలు 1994లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్నదాన కార్యక్షికమం చేపట్టారు. మొదట్లో 40 నుండి 50 మంది వరకు మాత్రమే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేవారు. కానీ, ప్రస్తుతం ప్రతి అమావాస్యకు వేల సంఖ్యలో అన్నదానాన్ని స్వీకరిస్తున్నరు.

1991లో కీ.శే. పాలెం సౌరప్ప తన శిష్యబృందంతో ప్రతి అమావాస్యకు ఇక్కడకు వచ్చేవారు. ఆయన రాత్రి ఇక్కడే బస చేసి, భజనలు చేసి తిరిగి వెళ్లేవారు. అనంతర కాలంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాతలు కూడా ముందుకు వచ్చి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. ప్రత్యేక ధార్మిక కార్యక్షికమాలు, భజనలు నిరంతరంగా ప్రతి అమావాస్యకు జరుగుతున్నయి.

బండెనుక బండి...
బ్రహ్మోత్సవాలలో భాగంగా కార్తీక శుద్ధ సప్తమి నాడు జరిగే ‘ఉద్దాల ఉత్సవం’లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తరు. జాతరను తిలకించడానికి జిల్లాలోని వివిధ గ్రామాల నుండి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ఆటోలతో పాటు స్వంత వాహనాలలో వస్తరు. ఇప్పటికీ ఎడ్లబండ్లు విశేషంగా ఇక్కడ కనిపిస్తయి. కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్న జంటలను తమ ఇళ్ళకు ఆహ్వానించి తల్లిదంవూడులు కురుమూర్తి జాతరకు తీసుకు సంతృప్తి పరుస్తరు. భక్తి పారవశ్యంతోపాటు కుటుంబ సభ్యులు, బంధుమివూతుల ఆత్మీయ సమ్మేళనానికి కురుమూర్తి జాతర ఒక ఆహ్లాదకరమైన వేదికగా నిలవడం విశేషం.
పౌరాణికంగా ఎంతో ప్రాధాన్యం గల పుణ్యక్షేవూతాలు తెలంగాణలోనూ ఉన్నాయనడానికి మహబూబ్‌నగర్ జిల్లాలోని కురుమూర్తి క్షేత్రమే ఒక ఉదాహరణ. తిరుమల తిరుపతి శ్రీవేంక పోలిన ప్రత్యేకతలు ఇక్కడా ఉండడం విశేషం.

- తిరుమలలోని ఏడుకొండలపై వెలసిన శ్రీవేంక స్వామికి ‘అలిపిరి మండపం’ ఉండగా ఇక్కడ కురుమూర్తి శ్రీవేంక స్వామి వారికి ‘ఉద్దాల మండపం’ ఉంది.

- తిరుపతిలో దర్శనానికి వెళ్ళేటప్పుడు ‘మోకాళ్ళ గుండు’ పేర్న ఎత్తయిన కొండ ప్రాంతాన్ని పోలిన ప్రదేశం ఉంటుంది. ఇక్కడా అలాంటిదే ఉంది.

- తిరుమలలోనూ, కురుమూర్తిలోనూ ‘పాద చిహ్నాలు’ ఉండటం మరో విశేషం. తిరుమలలో శ్రీవారు నిలుచున్న భంగిమలోనే భక్తులకు దర్శన మిస్తడు. ఇక్కడ కూడా అదే విధమైన భంగిమలో స్వామి సాక్షాత్కారం లభిస్తుంది.

- తిరుపతిలో ‘ఏడు కొండల’పై స్వామి వెలిశాడు. కురుమూర్తిలోనూ చిత్రంగా ‘ఏడు కొండలు’ ఉండటం మరో అనూహ్యం. ఇక్కడి ఏడుకొండల ప్రస్తావన 1878లో నరసింహ దీక్షితులు రచించిన చెంచుకథలో ఉంది. తిరుమల గుట్టలను పోలిన ఏడు గట్టుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి: శ్వేతాద్రి- బొల్లిగట్టు, ఏకాద్రి- ఒంటిగట్టు, దుర్గాద్రి- కోటగట్టు, ఘనాద్రి- పెద్దగట్టు, భల్లూకాద్రి- ఎల్గులగట్టు, పతగాద్రి- చీపర్లగట్టు, దైవతాద్రి- దేవునిగట్టు.

- దేవునిగట్టుపైనే కురుమూర్తి స్వామి కొలువై ఉన్నడు. జానపదులు ఈ క్షేత్రాన్ని కురుమతి, కురుమూర్తి, కుర్మతి, కుర్మూర్తి అని పిలుస్తరు. ఇక్కడి స్వామిని కురుమన్న స్వామిగా, కురుమతిరాయుడిగా కొలుస్తరు.

- సాధారణంగా ప్రతి ఆలయంలోనూ గణపతి విగ్రహం తప్పక ఉంటుంది. కానీ, తిరుపతి, కురుమూర్తి ఆలయ ప్రాంగణాలలో మాత్రం ఆ విఘ్ననాయకుడు మనకు కనిపించడు. ఈ రెండు క్షేత్రాల పోలికల నేపథ్యంలో ‘తిరుపతిలోని ఆనందగిరి శిఖరం’లోని కొంత భాగమే ‘కురుమూర్తిగిరి’ అని స్థల పురాణం వివరిస్తోంది.

- మరో విషయం, కురుమూర్తి గుట్టపై స్వామి వారి దర్శనానికి వెళ్లేదారిలో ఉన్న చెన్నరాయుడి గుడి కూడా అతి ప్రాచీనమైందిగా చెప్తారు. క్రీ.శ.1350లోనే దీనిని నిర్మించి ఉంటారని కొందరు పరిశోధకులు భావిస్తున్నరు.

ఎలా వెళ్ళాలి?
ఈ క్షేత్రం మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్న చింతకుంట మండల పరిధిలోని అమ్మాపురం గ్రామానికి చేరువలో వుంది. సికింవూదాబాద్ నుండి గుంతకల్లు వెళ్ళే రైలు మార్గంలో ‘కురుమూర్తి’ రైల్వేస్టేషన్‌లో దిగి భక్తులు కురుమూర్తి ఆలయానికి చేరుకోవచ్చు. కురుమూర్తి రైల్వేస్టేషన్ నుండి దక్షిణం వైపు 6 కి.మీ. దూరంలో ఆ ఆలయం ఉంటుంది. ఆర్టీసీ బస్సులలో మహబూబ్‌నగర్ నుండి లేదా జాతీయ రహదారి కొత్తకోట నుండి మదనాపురం మీదుగా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. అమావాస్య, బ్రహ్మోత్సవాల సందర్భంలో మాత్రం ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడుపుతుంది.

స్వామిసేవలో వివిధ వృత్తుల వాళ్లు
కన్నుల పండువగా జరిగే ‘కురుమూర్తి స్వామి ఉద్దాల ఉత్సవం’ అనేక ప్రత్యేకతలతో కూడుకొని ఉంటుంది. స్వామివారి ఉత్సవాల ఏర్పాట్లలో వివిధ వృత్తుల వారు భక్తితో పాలుపంచుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. దీన్ని నేటికీ నిర్వాహకులు అనుసరిస్తున్నరు. స్వామివారి సేవలో తమకు లభించిన అపూర్వ అవకాశంగా వివిధ వృత్తుల వారు భావిస్తరు. దైవసన్నిధిలోని ‘భిన్నత్వంలో ఏకత్వానికి’ ఇది నిదర్శనం.

మేదరుల పాత్ర
ఉద్దాల ఉత్సవంలో స్వామివారి పాదుకలను తీసుకు వడ్డేమాన్‌కు చెందిన మేదరులు ప్రత్యేక చాటను తయారు చేస్తరు. దీపావళి అమావాస్య రోజు చాట తయారీ ప్రారంభిస్తరు. ఉత్సవం నాటికి పూర్తి చేసి దళితులకు అందజేస్తరు. దాంతో స్వామికి దళితుల సేవకు శ్రీకారం పడుతుంది.

దళితుల సేవ
అమావాస్య రోజు వడ్డేమాన్ ఉద్దాల కర్మాగారంలో ఇసుకపై కనిపించే పాదాల గుర్తుల ఆధారంగా స్వామివారి పాదుకలు (ఉద్దాల) తయారు చేస్తరు. వారం పాటు కఠోర ఉపవాస దీక్షలతో, నియమ నిష్ఠలతో వడ్డేమాన్ దళితులు స్వామివారి పాదుకల తయారీలో పాల్గొంటరు. స్వామివారి పాదులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లమర్రి మేదరులు తయారు చేసిన ప్రత్యేక చాటలో వాటిని తిర్మలాపురం చేరుస్తరు. అక్కడి నుండి కురుమూర్తి కొండపై ఉన్న ఉద్దాల మండపంలో భక్తుల దర్శనార్థం వాటిని ఉంచుతరు.
ఉద్దాల మండపంలో దళితులే పూజారులుగా ఉండటం మరో ప్రత్యేకత. స్వామివారి పాదుకలతో వీపుపై కొట్టించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

కుమ్మరుల కుండ
కురుమూర్తి స్వామి సన్నిధిలోని మరో ఆచారం మట్టికుండ. అప్పంపల్లికి చెందిన కుమ్మరులు దీనిని తయారుచేస్తరు. ఆ మట్టికుండను ‘తలియకుండ’ మండపంలో ఉంచి, నెల్లి వంశస్థులు పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో భారీగా బాణసంచా కాలుస్తరు. డప్పు వాయిద్యాలతో మట్టికుండను ఉద్దాల మండపం వద్దకు చేరుస్తరు.

ఈ ఉద్దాల వేడుకను తిలకించడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తరు. ఉద్దాల ఉత్సవం సందర్భంగా అప్పంపల్లి వాగు పరిసరాలు జన సంద్రాన్ని తలపిస్తయి.

బ్రహ్మోత్సవాలు
శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పాడ్యమి మొదలు కొని శు॥ సప్తమి వరకు జరుగుతయి. ఈ సంవత్సరం దీపావళి అనంతరం నవంబర్ మధ్యలో ఈ ఉత్సవాలు ప్రారంభమైనాయి. పాడ్యమి నుండి సప్తమి వరకు వరుసగా మయూర, హంస, గజ, శేష, హయ, హనుమంత, గరుత్మంత వాహనాలపై స్వామివారి ఊరేగింపు ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. తెలంగాణ ప్రాంతంలో జరిగే అతిపెద్ద తిరునాళ్ళ (జాతర)లో కురుమూర్తి కూడా ఒకటి.

శ్రీకురుమూర్తి బ్రహ్మోత్సవాలు గత నవంబర్ 13న అమావాస్యతో ప్రారంభం కాగా, 21వ తేదీదాకా రోజూ వివిధ సేవలను నిర్వహించారు. పుష్పయాగం వంటి కార్యక్షికమాలన్నీ కన్నులపండువగా జరిగాయి. బ్రహ్మోత్సవ కార్యక్షికమాలు నవంబర్ 29న అధికారికంగా ముగిసినా జాతర ఈ నెల 13 (అమావాస్య) దాకా సాగుతుందని ఆలయ అధికారులు చెప్పారు. తర్వాత మరో రెండురోజులూ (ఈ నెల 15 వరకూ) అనేకమంది భక్తులతో కురుమూర్తి క్షేత్రం కోలాహలంగానే ఉంటది.
వ్యాసకర్తల మొబైల్: 94410 59424

0 comments:

Post a Comment