Ads 468x60px

gghgh

Photo Slide

About TELANGANA


Telangana region is part of Andhra Pradesh state in southern India. It constitutes Hyderabad, Adilabad, Karimnagar, Khammam, Mahaboobnagar, Medak, Nalgonda, Nizamabad, RangaReddy and Warangal districts. Telangana region is one of the least developed regions in India. Rampant poverty, illiteracy, malnourished children, child labor, farmer suicides, unemployment, water scarcity and electricity shortage are some of the problems of this region. There are millions of people who are not fortunate enough to send their children to schools or feed their children three time a day, or provide safe drinking water to their families in this area.
Showing posts with label Poems. Show all posts
Showing posts with label Poems. Show all posts

Wednesday, January 4, 2012

అమెరికా తెలుగు సంగాలు---ఒకొక్క పూవెసి చందమామ

**********************************అమెరికా తెలుగు సంగాలు---ఒకొక్క పూవెసి చందమామ ***************************




అమెరికా తెలుగు సంగాల లో ఊయ్యాలో



లోల్లీ మొదటికీ వచ్చింధీ-- ఊయ్యాలో



ఒక్కొక్క పూవె సి చందమామ



ఎత్త్హులు-- జిత్తులు చందమామ-----



కొద్ది రోజుల్లో



తెలుగు సంగాల సంరంబం పతాక స్థాయి కి చెరబోతుంధీ

జూదంగా మారుతున్న సంగ రాజకీయాలు



లాయ్ ల్ టి చూపిస్తున్న బ్రోకెర్లు



పరస్పర విమర్శల ఈ మైల్ లు



ఇఱుకు మనసుళ్లున్న మాజీ ప్రెసిడెంట్స్



సంగాలలో



వాళ్ళ ఉనికి కోసం



స్వంత ఏజెండాల కోసం



రంగా ప్రవేశం కోసం



తానా తందానా అంటూ



ఫోన్ కాల్స్ తో



ఈ మేల్స్ తో



దాగుడు మూతలు ఆడుతున్నారు



దారులు వెతుకుంటున్నారు



వీళ్ళకు కావలిసింధీ--- రాజరికం-- పెత్తనం--అధికారం



ఈ రోజు సంగాలలో



అస్పష్టత---తాబ్బిబ్బూ



అయోమయం--- గందరగోలంమ్



మాజీ నేతల మాటలు కలుషితం



ఈ మేల్స్ --కలుషితం



ఆలోచనలు--రాయబారాలు-- మార్గాలు--కలుషితం



ఎందుకు --మూసుకు దాగుడు ముచ్చట్లు



డాబు ప్రవ ర్తనాలు ?? అభద్దాలు ??? ఎందుకు ??దేనికి ??? ఎవరి కోసం ???



ఎందుకు ఈ పట్తింపులు ???ఎందుకు ఈ గొర్రె దాటులు ???



ఒబామా మార్పు కోసం

న్యాయం కోసం-- స్వేచ్ఛ కోసం--- వెలుగు కోసం



ఈ రోజు కావలిసింధీ--- సంగాలలో



ప్రతి గట న--- సంగర్షన--పోరాటం-- తిరుగు బాటు



గంప క్రింద కమ్మిన కోడి పుంజు కు తెలుసు



కూతకాల మెదొ --కునుకు కాలం ఏదో ???



తెలుగు లేని

తెలుగు సంగాలలో



నేను--- నా-- మనొల్లు



అంతా నాదే---ఆ ఆలోచనలు పోవాలి



ఈ నాటి తెలుగు సంగాల తీరు



ఆలోచనాపరుల ను---సబ్యుల ను



చిక్కు పెడుతున్నాయి



కలవార పెడుతున్నాయి



వెదిస్తున్నాయి--- బాదిస్తున్నాయి



అందరు ఐ క్యాత బావం కేక లేస్తున్నా



సమస్యలను సాగ దీస్తూ



పోరు-- క మెటిలు సత్తు అయిపోయీ



మళ్లీ ఆట మొదలు అయింధీ



అన్న మాట అచ్చరాల సత్తె మయింధీ



కొంతకాలం-- సంగాలలో చూసేధి



నవ్వడాలు---ఏడు వాడా లు



ఊక్రో శాలు----అక్రోషాలు



రోదానలు---వేదనలు



పుకార్లు--- గుసగుసలు



సలాం వాలెకుం-- హై -బైలు కరువు అయిపోతాయి



ఇప్పుడు కనిపిస్తుంధీ----సంగాలలో



చేతులు కలవడం లెధు



మంటలు ఆరడం లెధు



లయా--శ్రుతి--గమకాలు తప్పిన పాటల మాటలు-- ముచ్చట్లు



కొడూరాని పొత్తుళ్లు



ఈ ఏ గో ల తో



పట్తింపు ల తో



ఉన్నధి-- ఉంచుకున్నధి-- దూరం అయిపుతున్నాయి



దారి ఎటో--- మలుపు ఎటో



జీసస్--అల్లా-- రామా కాపా డు మా సంగాలను



*************************



బుచ్చి రెడ్డి

విషాదాలకింక స్వస్తి, తెలంగాణ కొరకు కుస్తి! - గోరేటి వెంకన్న

ఇద్దరము విడిపోతె బూమి బద్దలవుతుందా
ఇండియా పాకిస్తానోలె ఇనుప కంచె పడుతుందా
రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు
నువ్వు పద్యం పాడితె మేమూ పరవశించనూవచ్చు
నీ ఇడ్లి బండి అడ్డఅట్లే నీవె నిలుపు కోవచ్చు
సెక్రటేరియట్ల మాత్రము చక్రం దిప్పుట సాగది

తెలుగు జాతొక్కటని వొగలబడీ పోతున్నవు
ఒక్క తల్లి బిడ్డలమే ఒప్పుకుంటాము నిజమె
అన్నదమ్ములిద్దరము ఆస్తి పంచుకోవచ్చు
కాని బాదలల్ల నీవు నాతో బాగమయితదెంత చెప్పు
నీతో పడలేక ఆగమయి ఏరుపడి పోతుంటే
వేర్పాటు వాదమని ఎక్కి ఎక్కి ఏడ్చుడేంది?

బాషవొక్కటైతే సరే బాద పెట్టాలనుంద
జాతి వొక్కటైతె నన్ను గోతిల వేయాలనుందా
ఐన పోలికలుండచ్చు గాని పొతన యాడుంది మనకు
యాసలల్ల తేడాలేదా బాసలల్ల తేడాలేద
నీ అట్లతద్దికి బతక్మకు బందుత్వ మెక్కడిది
అట్టుకు జొన్నరొట్టెకు సుట్టరీక మెక్కడిది

గంటె గిన్నలతో వచ్చి వొంట మెసులు మెదలెడ్తిరి
చీరల మూటలతో వచ్చి లారి ఓనర్లైతిరి
సాంబారు పప్పు పొడుల సచ్చురుచులు నేర్పిస్తిరి
నా నాటుకోడి పలావు నీకేటరింగులో కలిపి
పచ్చడి బ్యారాలు జేసి పత్రిక ఓనర్లైతిరి
పట్ణం సివారులన్ని పట్తజేసుకోవడ్తిరి

నల్లరేగడున్నదంటె మెల్లగ మీ పాడెస్తిరి
కోచంగు సెంటర్లను కొల్లలు కొల్లలుగా తెరిచేస్తిరి
కాంట్రాక్టు వరకులల్ల కోట్లు మింగి కూసుంటిరి
కంపెని ఓనర్లయ్యి కాలుష్యం పెంచితిరి
కంపెనీల కొలువులన్నీ మీవారికి పంచితిరి
పబ్లిక్ సెక్టర్ను ముంచి పాట్లు చేసి అమ్మితిరి

సహాజవాయువున్నదని సంకలెగరేస్తున్నవ్
డెల్టా తరిబూముందని డక్కి కొట్టుకుంటున్నవు
విశాకుక్కు నాదేనని మజాకు చేస్తున్నవు.
కాటన్ కట్టను చూసుక కడుపు నిమురు కుంటున్నవు
అన్నుంటే ఉంచుకో నిన్నడిగితే చెప్పుతో కొట్టు
ఏమి లేనోల్లమె మరి ఎందుకు కలిసుంటున్నవు

ఓపికుంటే నా ప్రశ్నకు తీర్పు జెప్పు న్యాయంగ
లెక్క మీద జెప్పు నదులు ఎక్కడి నుండొస్తున్నవి
సాగు యోగ్యమైన బూమి శాతము నీదెంత జెప్పు
గను లెవ్వరివెక్కవో దర్మంగ నీవేజెప్పు
అన్నిమాకుండి చాల అబివ్రుద్దిలో తేడా యాల
అన్ని నీచేతికిచ్చి అడుక్కునుడే ఐక్యతనా

ఊరిలో ఆరెకరం జాగ గూడ లేనోనివి
ఈడికొచ్చి బాబులయ్యి విర్ర వీగి పోవడ్తిరి
ప్రొడ్యూసర్లు దర్శకులు ఫోజుకొట్టే హీరోలై
బాసను హీన జేస్తిరి బతుకును బారం జేస్తిరి
తెలంగాణ ఆడోల్లన రవిడి శకుంతలగ చూపి
గుండగిరికి మా పాత్రలు గుర్తుగ జూపిస్తిరి

అమీరుపేట అడ్డపెట్టీ అదికారం నెరుపుకుంట
హైద్రాబాదు మదేనని అంగడి బ్యారం పెడ్తిరి
కూకటిపల్లి సల్లగ కులుకుతుందని హొయలతోని
కాచిగుడ సుట్టేటము మూసి వాసనట్లేవుంది
వనస్తలిపురమేమొ వన్నె లొలికి పోతుంటే
వారాసి గూడ సుట్టు మోరీల కంపువుంది

బొగ్గుబావులెన్నివున్న అగ్గివెలుగు మకున్న
సాగుఔములాన్ని వున్న ఆకలి సావులే మాకు
త్యాగాల మాచరిత్ర తప్పుదారి మీద్రుష్టికి
విశాలంద్ర గిశాలాంద్ర జాంతానై సమైక్యాంద్ర
విలీనాలు గిలీనాలు మాపాలిట విషాదాలు
విషాదాలకింక స్వస్తి తెలంగాణ కొరకు కుస్తి

Tuesday, January 3, 2012

నా కలల తెలంగాణ – జూలూరు గౌరీశంకర్

తెలంగాణ మట్టి బిడ్డల
పాదాలకు మొక్కి
వాళ్ళ మనసులో జాగా పొందిన నేతలంతా దన్యులు
డోకా చేయటం తెలియని
మగోసి గుడ్డల అవ్వల అయ్యలు దీవిస్తేనేగా
ఎవరైన జాతి నేతలయ్యేది

మా సదానందంన్నట్లు – దేవేంద్రా –
ఎందరో విప్లవకారుల ప్రాణాలు
గాలిలోకి ఎగరినప్పుడు
నీచేతులకంటిన మరకలను తుడిచేసుకుని
ఆకాల్పులన్ని బూటకమని గొంతువిప్పు
ప్రజాస్వామ్య తెలంగాణ పాట పాడు
ప్రజాస్వామ్య తెలంగాణ ఆకాశంలో
పాలపిట్టల రెక్కలలార్తు

కేసిఆర్ రాజీనామలన్నప్పుడుల్లా
ఊద్యమ పొత్తిళ్లలోకి రా బిడ్డా అని పిలిచినోణ్ణి
ఇప్పుడు పాలపిట్టరంగు జెండాను నోరారా
పిలుస్తున్నా-

వాకిళ్ల మందు తెలంగాణ ముగ్గేద్దాం
మా పెరళ్లల్లోని స్తానికతను తవ్వి బచ్చలాకు చేసి
ఊదారంగు పందిరేద్దాం
ఈ మట్టిది పోరు అక్షరమాల
మన తల్లులు జన్మనిచ్చి పోరాటం నేర్పిండ్రు
ఉగ్గుపాలల్లో ఆత్మగౌరవాన్ని నూరిపోసిండ్రు
బిగించిన పిడికిళ్ల నిచ్చిండ్రు
మన తండ్రులు కుట్రలు నేర్పలేదు
శత్రువులకు ఆసరా కావొద్దన్నరు
ఫికర్ లేదు –
విడివిడిగా విడిపోయి ఏకమౌదాం-
మన జెండా తెలంగాణ పటం
బావాలు ఎన్ని జెండాలైన కానియ్
మనందరం తెలంగాన చౌరస్తాలో కలుద్దాం
అన్నిదారుల్లోంచి వచ్చి
మహా తెలంగాణ రస్తాలో కలుద్దాం-
ఇప్పుడు నేను ప్రాంతీయ దేశబక్తుల
తయారు చేస్తున్న
ఉద్యమ గణాంకశాకను

నీళ్లు, నిదులు, ఉద్యోగాలు
ముంబయ్, బొగ్గుబాయి, దుబాయ్
ఫ్లోరసిస్‌తో పోరు బూమి వంకర్లు
బిడ్డలను అమ్ముకుంటున్న నా జొన్నరొట్టెలు
అడవిలో నెత్తుటి రంగేసుకున్న చెట్లు
హోలిర హోలీ చెమ్మకేళిర హోలీ
దేవెంద్రా ఇన్నాళ్లు ఎక్కడ పాయె – నీతెలంగాణ పాట

ఇది కెసిఆర్, దేవేంద్రో పాడె పాట కాదు
ఆదిపత్యానికి తలకొరివి ఎవరు పెట్టినా
మన స్వపరిపాలన గేట్లు ఎవరు తెరచినా
ఆత్మగౌరవ నినాదమై ప్రతిద్వనిస్తాం-
నినాదాల నుంచి ఓటర్ల జాతర్ల నుంచి
ఉద్యమబాటకొచ్చేవాళ్లందరికి వాలేకుమ్‌సలామలేకుమ్-
కెసిఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో
దేవెందర్ జెండా పట్టుడో
ఇవన్ని మామూలు మాటల తూటాల వ్యూహాలు
తెలంగాణ వచ్చుడే నిజం
దాన్నాపటం ఎవనితరం కాదని చెపుదాం
వచ్చే తెలంగాణ ఎట్లుండాలో
ఇపుడే రాసుకుందాం-
ఈకన్నీళ్ల కొడవళ్లకు సమాదానాలు కావాలె
దొడ్ది కొమురయ్య నెత్తుటికి జవాబుకావాలె
ఐలమ్మల బతుకు మారాలె
వూరుకు వాడకు మద్య బెర్రలు చెరగాలె
ఇంతెందుకన్నా
బహుజన తెలంగాణ యాత్ర మొదలుకావాలె
పౌర హక్కలు గాయపడని నేల
చెట్లకు తుపాకులు పూయని నేల
మన సెరువుల నిండా కలువలు,
తామరులు విచ్చుకనే నేలఆదునిక దొరల పెత్తనాలు లేని అమ్మతనపు నేల
అన్నా అని పిలిస్తే
గుండానిండా ఆత్మగౌరవం ఉప్పోంగే నేల
నేను కలలుకంటున్న తెలంగాణ నేల
అన్నా దేవేంద్రా
మనకు వూరికి
పిడికెడు మంది ప్రకాశం పంతుళ్లున్నరు
గల్లీగల్లీలొ కొమురం బీములున్నరు
ఉద్యమాలకే వన్నెతెచ్చినోళ్ళున్నరు
మనకు సావులు కొత్తకాదు
సమ్మక్క, సారక్కలమై పుడుతూనే ఉంటం-
ఉద్యమానికి జీవం పోసి
నిప్పుల ఉప్పెనలోకి ఒక్క ఉదిటిన దూకిన వాళ్లనే
ఈనేల కౌగలించుకుంటది
వాదాన్ని చీల్చకుండా
దయ్యాల వేదాలు వల్లించకుండా
ఉద్యమ గీతానికి తొలి పల్లవి అవుదాం రా
ఈ మట్టి మీద మీద వొట్టు పెట్టి చెప్పు
దేశానికే ఎర్ర జెండానిచ్చింది ఈనేలేగా
రాగవులూ-
అమ్మతోడు సురవరం నిశాని ఏసిండు
నారాయణ ఎప్పటినుండో అరుస్తనే వుండు
రవ్వంత గోరంత కూసింత
మనసు మార్చుకోవా?
ప్రత్యేకతపై ఆస్తిత్వ సంతకం చేయవా?

మళ్ళి మళ్ళి చెబుతున్న
సరైన సమయానికి సరైన నిర్ణయం దేవేంద్రునిది
కాదంటావా చెప్పు బాబూ!
చెన్నమనేని మొకమాటం లేకండా తెగేసి చెప్పిండు
తమ్ముడు సాగర్ ఎప్పట్నుంచో తనే యిస్తనంటున్నడు
పెద్ద మనిషులు కాకా, పురుషోత్తములు చెప్పినంక
గింతకంటె మంచి సమయమెప్పుడొస్తదే
సెప్పండి..
ఈ మట్టీ మీద పుట్టిన నేతలారా!

జొన్న రొట్టెల మీదొట్టు
బతుకమ్మ మీదొట్టు
సమ్మక్క సారలమ్మ మీదొట్టు
దొడ్డి కొమరయ్య, ఐలమ్మల మీదొట్టు
ఎవరు అడ్డు పడినా తెలంగాణ రాలతప్పదు.

Friday, December 16, 2011

కొండమ్మ కొండమ్మ కొండమ్మా..... నువ్వు అమ్మ కాదు రాతి బొమ్మమ్మ


కొండమ్మ కొండమ్మ కొండమ్మా..... నువ్వు అమ్మ కాదు రాతి బొమ్మమ్మ
నువ్వు గుండెలు తీసిన బంటమ్మ..
నీది గుండె కాదు మందు గుండమ్మ ||2||


నీకు మనసే లేదు చిన్నమా....నికు మురళి బావ అండదండమ్మ ||2||
ని బావగాడు పెద్దా గుండా అమ్మ...మా గుండెలో దిమ్పిండు గుండు అమ్మ....||2||


ఓ... ఓ.... సురేఖమ్మ......నీ నాటకం యమ కేకమ్మ....||2||
ఈ గుండు ఎట్లా తొలిగేది చెప్పమ్మా....మా బాదేట్లా తీరేది చెప్పమ్మా....||2||


జగన్ గాడు గజ దొంగమ్మ.....చెయ్యి ఎత్తి జే కొట్టకే జేజమ్మ...||2||
నీ పుట్టింట్లో పుట్టింది రుద్రమ్మ...ఆ తల్లి నీడ నీలో లేదమ్మా...||2||


కొండమ్మ కొండమ్మ కొండమ్మా..... నువ్వు అమ్మ కాదు రాతి బొమ్మమ్మ
కొండమ్మ కొండమ్మ కొండమ్మా..... నువ్వు అమ్మ కాదు రాతి బొమ్మమ్మ
నువ్వు గుండెలు తీసిన బంటమ్మ..
నీది గుండె కాదు మందు గుండమ్మ .....

రగులుతుంది తెలంగాణా రుధిరా ధారా కారంగా

రగులుతుంది తెలంగాణా రుధిరా ధారా కారంగా |2 |
పిలుస్తుంది తెలంగాణా కర్ణబేరి పెలంగా |2 |
కదలరా సోదర తెలంగాణా తల్లిరా |2 |
తల్లి చేరాను విడిపించు ఆంధ్రులు చెలరేగంగా |2 |

బాగో బాగో ఆంధ్రవాలే బాగో...... జాగో జాగో తెలంగాణా జాగో.......
బాగో బాగో ఆంధ్రవాలే బాగో...... జాగో జాగో తెలంగాణా జాగో.......

నీ ఆస్తులేమైన మేము అడుగుతున్నామా
నీ అయ్య ముల్లెమైన కూరుతున్నమా...... |2 |
మానీరు, మా నేల, మా కొలువులు కావలి |2 |
మా యాస మా బాష మన్ననలు పొందాలి |2 |
మా హక్కులు అడుగుతుంటే అంత చులకన
వెటకారపు మాటలతో అవహేలనా..... |2 |

బాగో బాగో ఆంధ్రవాలే బాగో...... జాగో జాగో తెలంగాణా జాగో.......
బాగో బాగో ఆంధ్రవాలే బాగో...... జాగో జాగో తెలంగాణా జాగో.......

సాగదు సాగదు ఇక మీదట సాగదు|2 |
ఆగదు ఆగదు మా పోరు ఆగదు...|2 |

బాగో బాగో ఆంధ్రవాలే బాగో...... జాగో జాగో తెలంగాణా జాగో.......
బాగో బాగో ఆంధ్రవాలే బాగో...... జాగో జాగో తెలంగాణా జాగో.......

ఉవ్వెత్తున ఎగిసింది తెలంగాణా జ్వాల...తెలంగాణా జ్వాల

ఉవ్వెత్తున ఎగిసింది తెలంగాణా జ్వాల...తెలంగాణా జ్వాల
నలు దిక్కుల పాకింది తెలంగాణా జ్వాల
ఇక చాలు మన ఏడుపులు గుండెలు అవిసేలా ... గుండెలు అవిసేలా
ఖబాడ్డారు ఖబాడ్డారు బాగో ఆంధ్రావాలా


విద్యార్థుల రక్తం తో తడిచిందీ నేల....తడిచిందీ నేల
ఆ రక్తమే రాజింది తెలంగాణా జ్వాల
మనమేంటో చూడాలి లోకం ఈవేల....లోకం ఈవేల
ఖబాడ్డారు ఖబాడ్డారు బాగో ఆంధ్రావాలా

ఇచేది మీరే అరె తెచ్చేది మీరే..... నమ్ముకుంటే నట్టేట ముంచేది మీరే


ఇచేది మీరే అరె తెచ్చేది మీరే
ఇచేది మీరే అరె తెచ్చేది మీరే
నమ్ముకుంటే నట్టేట ముంచేది మీరే
నమ్ముకుంటే నట్టేట ముంచేది మీరే

పంతొమ్మిది వందల అరవై తొమిది నుండి ||2||
ఇగ ఇస్తం ఆగ ఇస్తం అని మీరు చెప్పుతుండ్రు ||2||
ఇచ్చుడేమో దేవుడెరుగు తేచినదంతా దోచుకుండ్రు||2||
ఇచుడెందో తెచ్చుడేందో చీకట్ల చిందులేందో||2||


ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా హనుమన్నా
ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా హనుమన్నా


ఉస్మానియా క్యాంపస్లా ఉద్యమాలు రేగుతుంటే||2||
కాలేజి పోరగాల్ల కాలు చేతులిరుగుతుంటే ||2||
పుట్టకొకడు చేట్టుకొకడు పిట్టలోలె రాలుతుంటే||2||
ఉలుకు లేదు పలుకులేదు ఓదార్పు యాత్ర లేదు||2||


ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా ఎంకన్న
ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా ఎంకన్న


డిసెంబెర్ నేలమోతం దిష్టి బొమ్మలైనారు||2||
డిల్లి నుండి గల్లిదాక గాజులేసి తిరిగిండ్రు ||2||
సుద్దపూసలోలె మీరు సాపనేక్కి కూసుండ్రు||2||
నీళ్ళు ఉన్న కాడ మీరు నీలాడతనంటారు ||2||

ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా కే.కే అన్న
ఇక మిమ్ము నమ్మబోము ఓ సీనన్న
మీ ఆటలు ఇంకా చెల్లబోవు మా కే.కే అన్న

స్సూడ సక్కనివాడు ఆ చందురూడు స్సూడాలేని వాడు మా చందురూడు


స్సూడ సక్కనివాడు ఆ చందురూడు
స్సూడాలేని వాడు మా చందురూడు

మచ్చ లేనివాడు ఆ చందురూడు
తనువంత మచ్చలున్న మా చందురూడు

చీకటిని తరిమే వాడు ఆ చందురూడు
చీకట్లో తరిమే వాడు మా చందురూడు

చల్లాని వెన్నాలిచ్చు ఆ చందురూడు
వెన్నెల్లో చల్ల దోచు మా చందురూడు

పాపలకు ఆటబొమ్మ ఆ చందురూడు
మా జన్మలతో ఆటలాడు మా చందురూడు

పున్నమ్మిలో పురిని విప్పు ఆ చందురూడు
పాపంనే పున్నమానే మా చందురూడు

ఆమసనాగామాయే ఆ చందురూడు
మా యాసనాగాముచేసే మా చందురూడు

అందరికి మేనమామ ఆ చందురూడు
మామకే సున్నం పెట్టు మా చందురూడు

అందరికి జాబిల్లి ఆ చందురూడు
గోడ మీది పిల్లి మా చందురూడు

రెండేసి కన్నుల వాడు మా చందురూడు
ఒక్క కన్ను కాన రాదు మా చందురూడు

కెరట్టాన్నిఉప్పెన చేసే ఆ చందురూడు
ఉప్పేనని అలగా మార్చే మా చందురూడు

పోలవరం పోడు మా చందురూడు
బాబ్లిలో బందులు చేసే మా చందురూడు

డిల్లీలో రోశయ్య.....
బాబ్లి లో చంద్రయ్య
తెలుగోడి ఇజ్జత్ మొత్తం
గిరిపెట్టి గోరి కట్టే

తెలుగోడి ఇజ్జత్ మొత్తం
గిరిపెట్టి గోరి కట్టే

తెలుగోడి ఇజ్జత్ మొత్తం
గిరిపెట్టి గోరి కట్టే

చేలోరే విద్యార్ధి.... బన్ కే సిపాయీ

చేలోరేవిద్యార్ధి... బన్ కే సిపాయీ
లడన లడాయి
హమే లడన లడాయి ..


చదివింది చాలుర... చెలరేగి ఆడరా ..
ఈ దొంగల పనిపట్టంగా పెన్నే గన్నాయేర... పెన్నే గన్నాయేర
పుస్తకాలు వీడరా పోరు బాట సాగర
అక్షరాలే బరిసేలాయే బలమెంతో చూపరా...బలమెంతో చూపరా


చేలోరే విద్యార్ధి
బన్ కే సిపాయీ
లడన లడాయి
హమే లడన లడాయి ..


జల్సలింక మానర జండా చేతపట్టర
అసెంబ్లీ ఆవరణలో దిమ్మె కట్టి పాతర ...దిమ్మె కట్టి పాతర
సైన్మకు పోవోద్దుర సైన్యమై సాగర
తెలంగాణా నినాదమే మన హీరో సోదర... మన హీరో సోదర
చేలోరే విద్యార్ధి
బన్ కే సిపాయీ
లడన లడాయి
హమే లడన లడాయి ..


కాలేజి కాదురా కదన రంగమాయేరా
ఈ వలసవాద గుండెల్లో అణుబాంబై మ్రోగర ...అణుబాంబై మ్రోగర
బలిదానలోద్దురా బ్రతికి సాదించార
రేపటి నీ తెలంగాణా కళ్లారా చూడరా... కళ్లారా చూడరా


చేలోరే విద్యార్ధి
బన్ కే సిపాయీ
లడన లడాయి
హమే లడన లడాయి ..