Ads 468x60px

gghgh

Photo Slide

About TELANGANA


Telangana region is part of Andhra Pradesh state in southern India. It constitutes Hyderabad, Adilabad, Karimnagar, Khammam, Mahaboobnagar, Medak, Nalgonda, Nizamabad, RangaReddy and Warangal districts. Telangana region is one of the least developed regions in India. Rampant poverty, illiteracy, malnourished children, child labor, farmer suicides, unemployment, water scarcity and electricity shortage are some of the problems of this region. There are millions of people who are not fortunate enough to send their children to schools or feed their children three time a day, or provide safe drinking water to their families in this area.

Wednesday, May 9, 2012

బాబుది దండయాత్రే అనుమతించం

-బాబుకు కిరణ్ సహకారం
- అందుకే భారీ ఎత్తున బలగాలు
- 3 వేల మంది జైళ్లలో ఉన్నారు
- నేడు జిల్లా బంద్ విజయవంతం చేయండి
- నిరసనలు మా హక్కు
- ఈ ప్రాంతంలో సమైక్యవాద కార్యక్షికమాలొద్దు
- జగన్‌కూ మినహాయింపు లేదు: కోదండరాం

kodanda-rom- talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, జనవరి 5, (టీ న్యూస్): తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టమైన వైఖరి ప్రకటించనంత వరకు వరంగల్ జిల్లాలో ఆయన పర్యటనను అడ్డుకుంటామని, ఎట్టిపరిస్థితిలోనూ ఆయన పర్యటనను అనుమతించేది లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణపై బాబు వైఖరి స్పష్టం కావాల్సిందేనని అన్నారు. గురువారం జేఏసీ కార్యాలయంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహాడ్డి, జేఏసీ కో-ఆర్డినేటర్ పిట్టల రవీందర్, జేఏసీ నాయకులు అద్దంకి దయాకర్, ఎం.సత్యం, కత్తి వెంకటస్వామి తదితరులతో కలసి కోదండరాం మాట్లాడారు. రైతు యాత్ర ముసుగులో తెలంగాణ ప్రజలపై బాబు దండయాత్ర చేస్తున్నారని కోదండరాం ధ్వజమెత్తారు. బాబుతో కుమ్మక్కైన సీఎం కిరణ్‌కుమార్‌డ్డి తెలంగాణ జిల్లాల పర్యటనకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తోందని ఆరోపించారు. బాబు కోసం వరంగల్ జిల్లాలో భారీ ఎత్తున పోలీసులను మోహరింపజేసి ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తోందని మండిపడ్డారు. ఎలాంటి కారణాలు లేకుండానే ముందస్తు అరెస్టులు చేస్తున్నారని, ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో 3,000 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. నిరసన తెలిపే ప్రజల హక్కును పాలకులు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు నిరసన కార్యక్షికమాలను చేపడుతూనే ఉంటామని కోదండరాం స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంతటి దాడులనైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని కోదండరాం అన్నారు. ఏ పార్టీతో సంబంధం లేని రైతు ఫణికర మల్లయ్యను సైతం అరెస్టు చేశారని, ఎమ్మెల్యేలనూ అరెస్టు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.