రాయిని నిరసనగా మార్చిందొకరు.. చెప్పులు చూపి శాపనార్థాలు పెట్టిందొకరు.. చీపుళ్లు ఎత్తి అవమానించిది ఒకరు.. ఆగ్రహంతో బూట్లను వేదికపైకి విసిరేసింది ఇంకొకరు! రూపం ఏదైనా అందరి నిరసన ఉద్దేశం ఒకటే! అందరు అడిగిందీ ఒకటే! తెలంగాణపై డొంకతిరుగుడు మాట కాదు.. తెలంగాణకు జై కొడతావా? నై కొడతావా? సకల ఉద్యమకారుల నుంచి చంద్రబాబుకు ఒకటే ప్రశ్న! సూటిగా తగులుతున్న ఆ ఒక్క ప్రశ్నే చంద్రబాబులో ఫ్యాక్షనిస్టును నిద్రలేపింది. సీమ వారసత్వాన్ని గుర్తు చేసింది. తెలంగాణ జెండా మాటున పబ్బం గడిపేసుకోవాలని చూసిన టీడీపీ టీ ఫోరంలో చిరాకు తెప్పించింది. ‘‘ఇంతకాలం మౌనంగా ఉన్నాం. ఇప్పుడలా ఉండం. ఎవరొస్తరో రండి తేల్చుకుందాం’’ అన్నట్టుగానే తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు. తోడు నిలిచిన సీమ ఫ్యాక్షనిస్టుల అండ చూసుకుని రెచ్చిపోయారు. ప్రత్యేక రాష్ట్రం కోసం మేమూ పోరాడుతున్నాం అంటూ వల్లెవేసే నేతాక్షిగేసరులు అదే తెలంగాణవాదులపై యుద్ధం ప్రకటించిన సన్నివేశం.. వరంగల్ జిల్లాలో ఆవిష్కృతమైంది. ఇకపై టీఆర్‌ఎస్, ఇతర తెలంగాణవాదులతో టీడీపీ అనుసరించనున్న యుద్ధ వ్యూహం నమూనా వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా బట్టబయలైంది. ఒక భావజాలంపై మరొక భావజాలం ఇకపై భౌతికదాడులనే ఎంచుకుంటున్న సంకేతాలు వెలువరించింది. రైతుల సమస్యలపై పాదయాత్ర ముసుగులో రాజకీయ కోణం నగ్నంగా నర్తించింది. నాయకుడు రైతుల దగ్గరకు వెళతాడు. కానీ.. ఆ రైతు పార్టీ నాయకుడో, కార్యకర్తో అవుతాడు! మరి ఫణికర మల్లయ్య మరెవరికీ పూనకూడదుకదా! ‘‘ఇగ రాండ్లి చూసుకుందాం.. ఇగ గ్రామాల్లో గిరిగీసుకుందాం’ అని ఎర్రబెల్లి చేసిన ప్రకటన వెనుక దాగి ఉన్న భరోసా ఈ సీమ ఫ్యాక్షనిజమే! ‘‘మా నాయకుడి పర్యటనను ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి.
అడ్డుకొని చూడండి.. అసలు సంగతి తెలుస్తుంది’’ అంటూ టీడీపీ నాయకులు ముందునుంచీ చేసిన హెచ్చరికలకు బలం ఈ ఫ్యాక్షనిజమే! జై తెలంగాణ అన్నవాళ్లను దంచండీ.. ఏమైనా మేం చూసుకుంటాం అని టీడీపీ నేతలు తమ శ్రేణులకు కర్తవ్యబోధ చేయడం వెనుక బలగం ఈ ఫ్యాక్షనిజమే! బాబు ప్రయాణం సాగింది మూడు నియోజకవర్గాల మీదుగానే అయినా.. ఈ మూడు ప్రాంతాల్లోనే తెలంగాణవాదుల నిరసన కార్యాచరణలు ఉన్నా.. దాడులు మాత్రం జిల్లా వ్యాప్తంగా జరగడమే ఇక్కడ విశేషం. ఇవి యాత్రను సజావుగా సాగించుకునేందుకు చేసిన దాడులు కాదు.. జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదాన్ని అణిచివేయడానికి, టీడీపీ వైఖరిని ఎవరూ నిలదీయకుండా చేసుకోవడానికి రచించిన కుట్రలేనన్నది తెలంగాణవాదుల ఆరోపణ. సమైక్యవాది సభ కోసం పాలకుర్తి వెళ్లొద్దని గడ్డం పట్టుకొని నచ్చచెబుతున్న చోట కూడా రక్తం కారించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఎర్రబెల్లి స్వగ్రామం, పర్వతగిరి మండల కేంద్రంలో తెలుగుతమ్ముళ్లు రెచ్చిపోయారు. మహిళన్న విచక్షణా పాటించలేదు. కర్రలు బుర్రలను బద్దలుకొట్టాయి. నెక్కొండ (నర్సంపేట నియోజకవర్గం)లో రాస్తారోకో చేస్తోన్న టీఆర్‌ఎస్, జాక్ ఇతర తెలంగాణవాదులపైనా టీడీపీ కార్యకర్తలు విచక్షణను మరచిపోయి కొట్టారు. ఈ దాడిలో హెడ్‌కానిస్టేబుల్ సహా పలువురికి గాయాలయ్యాయి. ఇదే నియోజకవర్గంలోని గూడురు, నల్లబెల్లి దుగ్గొండి మండలాల్లోనూ ఇదే తీరు! ఆత్మకూర్ మండల కేంద్రంలో పరకాల నియోజకవర్గ పసుపుదళం పాశవికంగా దాడులకు దిగింది. గీసుగొండలో బెదిరింపులకు గురిచేసింది. జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో, ఒకే రీతిగా దాడులకు దిగడంలాంటి చర్యలు ఇక నుంచి జిల్లాలో టీడీపీ రాయల‘సీమ’ ఫ్యాక్షన్ సంస్కృతిని అమలు చేయబోతున్నాదా? అన్న అనుమానాలను రేకెత్తిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
చంద్రబాబు పర్యటించని నియోజకవర్గాల్లో బయటి జిల్లాల నుంచి వచ్చినవావ్లూవరూ లేకపోవడం గమనార్హం. ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలే తమతమ అధినేతల నుంచి అందుకున్న ‘దంచుడు’ వ్యూహానికి దారులు వేసినట్టు, ఆ వ్యూహం, స్కెచ్ అంతా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే రూపొందినట్లు స్పష్టం అవుతోందని వారు విమర్శిస్తున్నారు. చంద్రబాబు కాన్వాయికి 40 వాహనాల ముందు, 40 వాహనాల తరువాత మొత్తం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన యువకులు నిండిపోవడం, పాదయాత్ర ముందూ వెనుకా వాళ్ల తరువాతే స్థానిక నాయకులు ఉండటం గమనిస్తే అంతా పక్కా వ్యూహం ప్రకారమే జరిగిందన్న అభివూపాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చంద్రబాబు తెలంగాణ రైతుల కష్టాన్ని కడతేర్చేందుకు చేసిన యాత్రలా కాకుండా తెలంగాణపై పోరుయాత్ర చేసినట్టుగా ఉందని, ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలే దీన్ని స్పష్టం చేస్తున్నాయని టీఆర్‌ఎస్ మండిపడుతోంది.
ముందు అనుకున్నట్టుగానే చంద్రబాబు మాట్లాడుతుంటే జై తెలంగాణ.. ఆంధ్రాబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశాను. అంతే ఒక్కసారిగా చంద్రదండు దుడ్డు కర్రలతో, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఎయ్యిరా ఎయ్.. అంటూ కొట్టారు. తప్పించుకుని ఉరికాను. వెంటపడి పీకపట్టుకుని కర్చీఫ్ నుంచి కత్తి తీసి పొడవబోయారు. పోలీసులు అడ్డుకుని కాపాడారు. చంద్రదండు దెబ్బలకు సృ్పహ తప్పి పడిపోయాను. పోలీసులే ఆసుపవూతులకు తరలించారు.
-కంచర్ల మనోజ్‌కుమార్,
కేయు విద్యార్థి
చంద్రబాబు ప్రసంగం సజావుగా సాగితే మనం వేస్ట్ అని డిసైడయ్యా. అప్పటికే సభలో దుడ్డు కర్రలతో తిరుగుతున్న వారి నుండి తప్పించుకోలేమని తెలుసు. అయినా సరే చంద్రబాబు మాట్లాడుతుండగానే జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టాను. అంతే వెనుక నుంచి చంద్రబాబు గూండాలు కొట్టడం మొదలుపెట్టారు. అయినా పట్టించుకోలేదు. నినాదాలు చేస్తూనే ఉన్నా. బారికేడ్లు ఊడిపోయాయి. కడుపుపై, తలపై కొట్టడం మొదలుపెట్టారు. అంతలోనే పక్కనున్న స్నేహితులు కూడా నినాదాలు చేయడం మొదలు పెట్టారు. ఎవరు ఎవరిని కొడుతున్నారో అర్థం కాలేదు. పోలీసులు చంద్రబాబు గూండాల నుంచి తప్పించి బయటికి తీసుకువచ్చారు.
- రాజుయాదవ్, కేయూ విద్యార్థి
0 comments:
Post a Comment