"చంద్రబాబు , నేను కలిస్తె అద్భుత ఫలితాలు" అని మన తెలంగాణ పొలిటికల్ లెజెండ్ స్టేట్ మెంట్ ఇచ్చారు !
బాబు నుంచి తెలంగాణ కి అనుకూలంగా ఒక్క స్టేట్ మెంట్ రాక ముందె ఎందుకంట వాడి ముందు మోకరిల్లడమొ అర్దం కావడం లేదు !
ఓటు, సీటు పాలిటిక్స్ తో తెలంగాణ ప్రజలను కేవలం ఓటర్లు, సోమరిపోతులుగా మారిస్తె లాభం లేదు.
ఏడేళ్ళ కాలం లొ ప్రజలకు కోల్పొతున్నామనె భావన కల్పించడం లొ సఫలం అయ్యారా ? దాన్ని సరిదిద్దుకునె యత్నం చేసు కోకుండ ఫిసికల్ ఫిట్నెస్ లేక, శ్రమించె తత్వం లేక మల్లి, సులభ మార్గాల గురించి, ఎత్తుగడల గురించి ఆలోచించడమా ? మానవ సంబందాలు అక్కర లేదా ? చెప్పిన విషయాలు పట్టించు కోవల్సిన అవసరం లేదా ?
తెలంగాణ జాగరణ సేణ ఎందుకు పెట్టారు ? ఎందుకు రద్దు చేశారు ? తెలంగాణ సంబురాల ముచ్చటేది ? తెలంగాణ భవన్ లొ తెలంగాణ స్పైస్ ఎటు పోయింది ? బతుకమ్మ సినిమా తీస్తానని ఎందుకు తీయలేదు ? న్యూస్ పేపర్ ఎందుకు స్టార్ట్ చేయలేదు ? ముస్లిం లకు 12% రిజర్వెషన్ ఎందుకు ? అగ్రవర్ణాలలో పేదవారి సంగతి ఏమిటి ?
బి.జె.పి బంద్ కి మద్దతీయక, అటుపై వారిని మద్దతు అడగడమా? 610 జి.ఒ. విషయం లొ సోరకాయ, ఆందెపు కాయ ముచ్చట చెప్పె ఆయన సోరకాయ మనిషి తొ సోపతెందుకు ?
ఒక అస్సాం..ఒక నాగాలాండ్..ఒక గూర్ఖాలాండ్..ఒక రాజస్తాన్ లాగ తెలంగాణ మారితె ఇక్కడి ప్రజలకు ఆంద్ర పాలకుల నుండి విముక్తి రాదా ?
ఇదంతా నాకు నిద్రలో వచ్చిన కల ! అయినా ఇదంతా నేను ఎవరిని అడగ గలను ?
0 comments:
Post a Comment